Porumamilla: పోరుమామిళ్లలో చెలరేగుతున్న లిక్కర్ సిండికేట్ దందా!

Porumamilla: పోరుమామిళ్లలో వినాయక చవితి టార్గెట్‌గా చెలరేగుతున్న లిక్కర్ మాఫియా. ఎంఆర్‌పీ కంటే అదనపు ధరలకు విక్రయాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.

P Upendra, Kadapa Porumamilla
Published on: 13 Sept 2026 12:45 PM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్లలో చెలరేగుతున్న లిక్కర్ సిండికేట్ దందా!

Porumamilla: పోరుమామిళ్ల మండలంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోంది, సిండికేట్ గా తయారయి లిక్కర్ డాన్లు చక్రం తిప్పుతున్నారు.పేద ప్రజలు, కూలీలను, సామాన్య ప్రజలను అడ్డంగా, పబ్లిక్ గా దోచుకుంటోంది. క్వార్టర్ బాటిల్ పై 10 నుంచి 20 రూపాయల వరకు నిస్సిగ్గుగా దోపిడీ చేస్తోంది. ఎం ఆర్ పి రేట్లకు పాతర వేసి వినాయక చవితి పండగే టార్గెట్ గా పేదవాడి ఆనందంలోకి, జీవనంలోకి దెయ్యంలా చొరబడుతోంది.

ప్రజా సంఘాలు, మీడియా ఈ మాఫియా బట్టలూడదీసి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో నగ్నంగా నిలబెట్టినా, నలుగురు నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు అంటోంది. కొంతమంది అవినీతి అధికారులు, అవినీతి విలేకరుల సహకారంతో యదేచ్చగా లిక్కర్ డాన్లు చక్రం త్రిప్పుతూ తమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ప్రక్క మండలాలకు, జిల్లాలకు, ఆపై రాష్ట్రమంతా ఈ మాఫియా విస్తరించకుండా చిత్తశుద్ధి కల్గిన జిల్లా అధికారులు, నాయకులు కట్టడి చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

ఈ లిక్కర్ మాఫియా వల్ల విజయవంతంగా నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి అపకీర్తి వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ లిక్కర్ మాఫియాపై కొరడా జులిపించాలని, తోకలు కత్తిరించాలని నిజమైన టీడీపి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, మందు బాబులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ధర్నాలు, రాస్తారోకోలు మొదలై ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రమాదం పొంచివుంది అధికారులూ, లిక్కర్ డాన్లు తస్మాత్ జాగ్రత్త.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla