Porumamilla: కుటుంబ తగాదాలతో మహిళ దారుణ హత్య – రిటైర్డ్ సైనికుడిపై అనుమానం

Porumamilla: వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో దారుణం. భార్యాభర్తల మధ్య గొడవతో రెండో భార్య హత్య. విశాఖపట్నంకు చెందిన మహిళగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

P Upendra, Kadapa Porumamilla
Published on: 21 Aug 2026 8:19 PM IST
Porumamilla
X

Porumamilla: కుటుంబ తగాదాలతో మహిళ దారుణ హత్య – రిటైర్డ్ సైనికుడిపై అనుమానం

పొరుమామిళ్ళ: భర్తతో విడాకులు తీసుకున్న మహిళను రిటైర్డ్‌ మాజీ సైనిక ఉద్యోగి రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండకుండా అప్పుడప్పుడు పొరుమామిళ్ళ వచ్చి పోతుండేవారని సమాచారం.

ఈ క్రమంలో ఈరోజు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మహిళ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.మృతి చెందిన మహిళకు ఇద్దరు పిల్లలు, విశాఖపట్నం ప్రాంతానికి చెందిన మహిళ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla

Next Story