Rayachoti: ఓదివీడు హత్య కేసును ఛేదించిన పోలీసులు!
Rayachoti: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో జరిగిన ఖాసీం వలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కువైట్ నుంచి ప్లాన్ చేసి హత్య చేయించినట్లు సీఐ తెలిపారు.
Rayachoty: ఓదివీడు హత్య కేసును ఛేదించిన పోలీసులు!
Rayachoti: కడప జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో ఆగస్టు 29న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసును పోలీసులు చేదించారు. హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఖాదర్ వలి ని పోలీసులు అరెస్టు చేసి ఓ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే కువైట్ నుంచే షాహిదా భర్త షేక్ నాగిన్ భాష తన సోదరుడు షేక్ ఖాదర్ వలి, పిన్నమ్మ కుమారుడు బాబ్జి లతో ఖాసీం వలి ని హత్య చేయించారని సుండుపల్లి సీఐ సురేష్ రెడ్డి అన్నారు.
వీరబల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో సిఐ సురేష్ రెడ్డి వివరాలను వెల్లడించారు. కువైట్ లో ఉన్న నాగిన్ భాష రెండు వివాహాలు చేసుకున్నారన్నారు. మొదటి భార్య కడపలో ఉండగా, రెండవ భార్య షాహిదా వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో ఉంటుందన్నారు. వీరబల్లి మండలం ఓదివీడు గ్రామానికి చెందిన షేక్ షాహిదాతో ఖాసీం వలి వివాహేతర సంబంధం పెట్టుకుని వచ్చి పోయే వారన్నారు.
ఈ క్రమంలో కడప నుంచి స్కూటీలో శనివారం ఓదివీడు గ్రామం షాహిదా ఇంటికి వచ్చారన్నారు. వారిరువురు కలిసి ఉన్న విషయం కువైట్లో ఉన్న షాహిదా భర్త నాగీన్ బాషాకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమ సంబంధం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో వరుసకు సోదురులైన షేక్ ఖాదర్ వలి, షేక్ హుస్సేన్ భాష అలియాస్ బాబ్జి లకు తెలిపి చంపేయాలని పురమాయించారన్నారు.
వారు పథకం ప్రకారం కడప నుంచి ఖాసీం వలి ను ఫాలో అవుతూ వచ్చి షాహిదా ఇంటిలో ఉండగా గడియపెట్టారన్నారు. షాహిదా కుమార్తెతో వీడియో తీయిస్తూ కర్రలతో, బెల్ట్స్, కూరగాయల కోసే అట్టలతో కొట్టి ఖాసీం వలి ని దారుణంగా చంపేశారన్నారు. షాహిదాను కూడా కొట్టి బయటకు పంపినట్లు చెప్పారు. ఆమె తిరుపతి రుయాలో చికిత్స ఉంది అక్కడి నుంచి ఆమె కనిపించకుండా పోయిందన్నారు.
హత్యకు గురైన ఖాసీం వలి సోదరుడు సయ్యద్ ఖాదర్ భాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని సీఐ తెలిపారు. కేసులో కువైట్ నుంచి నడిపించిన కడప మోచంపేటకు చెందిన నాగిన్ భాష, షేక్ హుస్సేన్ బాషా అలియాస్ బాబ్జి, షేక్ ఖాదర్ వలీలు ఉన్నారన్నారు. వీరిలో ఖాదర్ వలీ ని రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఉండగా ఉదయం అరెస్టు చేసినట్లు తెలిపారు.
కువైట్ లో ఉన్న నాగిన్ భాష పై కువైట్ ఎంబసీకి తెలిపి పాస్పోర్టు సీజ్ చేసి త్వరలో ఇండియాకు రప్పిస్తామన్నారు. పరారీలో ఉన్న మరో ముద్దాయి షేక్ హుస్సేన్ అలియాస్ బాబ్జి ని త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామన్నారు. ఈ మేరకు ముద్దాయిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు సీఐ సురేష్ రెడ్డి తెలిపారు.




