Annamayya: అన్నమయ్య జిల్లాకు దక్కిన బీజేపీ రాష్ట్ర స్థాయి గుర్తింపు!
Annamayya: అన్నమయ్య జిల్లాకు చెందిన పీట్ల అంజలి రాజానాల బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
Annamayya: అన్నమయ్య జిల్లాకు దక్కిన బీజేపీ రాష్ట్ర స్థాయి గుర్తింపు!
అన్నమయ్య: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీలో అన్నమయ్య జిల్లాకు చెందిన పీట్ల అంజలి రాజానాలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో, సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఎస్సీ వర్గాల సమస్యలను రాష్ట్ర స్థాయిలో పార్టీ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఎస్సీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని, బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం అనంతరం బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డిని అంజలి రాజానాల మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అందిస్తున్న ప్రోత్సాహం, సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంజలిని అభినందించి, రాష్ట్ర స్థాయిలో పార్టీకి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు.




