Rayachoti: కన్వీనర్ కోటా సీట్లపై ఫీజుల దందా ఆపాలి పీడీఎస్‌యూ డిమాండ్!
Rayachoti: కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ప్రైవేట్ కాలేజీలు అదనపు ఫీజులు వసూలు చేయడాన్ని తక్షణమే అరికట్టాలి.
Rayachoti: కన్వీనర్ కోటా సీట్లపై ఫీజుల దందా ఆపాలి పీడీఎస్‌యూ డిమాండ్!
Rayachoti: కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థుల నుంచి హాస్టల్, బస్, డొనేషన్, కోచింగ్ తదితర పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న డిమాండ్ చేశారు.
ఆదివారం పీడీఎస్‌యూ రాయలసీమ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, “అదనపు ఫీజులు చెల్లిస్తేనే అడ్మిషన్.. లేకపోతే సీటు ఇవ్వం” అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. మంచి ర్యాంకులు సాధించి కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపడం వారి విద్యా హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులు కష్టపడి ర్యాంకులు సాధిస్తే, వారి సీట్లను అడ్డుపెట్టుకుని కాలేజీలు డబ్బులు దండుకోవడం విద్యా వ్యవస్థకే మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యను వ్యాపారంగా మార్చిన కాలేజీ యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, కన్వీనర్ కోటా సీట్ల పేరుతో అదనపు ఫీజులు వసూలు చేయకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అక్రమంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని కోరారు. కన్వీనర్ కోటా సీట్లు కాలేజీ యాజమాన్యాల సొంత ఆస్తులు కావని, విద్యార్థుల హక్కులను డబ్బుతో కొనలేరని స్పష్టం చేశారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. అంకన్న మాట్లాడుతూ, విద్యార్థులపై అదనపు ఫీజుల భారాన్ని మోపకుండా ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నగర నాయకులు దుర్గేష్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.




