Rayachoti: డీఎస్సీలో ఎలాంటి అవకతవకలూ జరగలేదు టీడీపీ!

Rayachoti: కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఎంపికలు పూర్తి చేసిందని గాలివీడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి వెంకట శివారెడ్డి స్పష్టం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Aug 2026 10:26 AM IST
Rayachoti
X

Rayachoti: డీఎస్సీలో ఎలాంటి అవకతవకలూ జరగలేదు టీడీపీ!

Rayachoti: కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు డీఎస్సీ అంటూ కొత్త నినాదాన్ని తెర పైకి తెచ్చారంటూ వైసీపీ పై తీవ్రస్థాయిలో గాలివీడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి వెంకట శివారెడ్డి మండిపడ్డారు.

రాయచోటి బంగ్లా సర్కిల్ నాలుగు రోడ్ల కూడలిలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని నిష్పక్షపాతంగా కూటమి ప్రభుత్వం అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసిందన్నారు.

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులను గాలికి వదిలేసి నేడు నిరుద్యోగులకు అండగా రిలే నిరాహార దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఎన్నికలలో ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story