Rayachoti: మహానాడు వేదికగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Rayachoti: జగన్ తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తి లేదని అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 28 May 2026 10:00 AM IST
Rayachoti
X

Rayachoti: మహానాడు వేదికగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Rayachoti: వైయస్ జగన్ తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా 11 క్లస్టర్లలో డిజిటల్ ద్వారా జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టిడిపి జెండాను ఆవిష్కరించి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. టిడిపి మహా వృక్షమని, రానున్న రోజుల్లో నారా లోకేష్ సారథ్యంలో టిడిపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి జోష్యం చెప్పారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా డిజిటల్ ద్వారా మహానాడు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని, కార్యకర్తలు, నాయకులు గ్రూప్ రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజేపి ఉమ్మడిగా పోటీ చేసి అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. తనను టిడిపి గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి ని చేసిందన్నారు. తాను టిడిపి కోసం పనిచేస్తానన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు టిడిపిలోనే కొనసాగుతానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story