Ramapuram: రాశమల్లు నరసింహ భౌతికకాయానికి నిశ్చల్ నాగిరెడ్డి నివాళులు!
Ramapuram: రామాపురం మండలం కల్పనాయనచెరువులో రాశమల్లు నరసింహ భౌతికకాయానికి నివాళులర్పించిన మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
Ramapuram: రాశమల్లు నరసింహ భౌతికకాయానికి నిశ్చల్ నాగిరెడ్డి నివాళులు!
Ramapuram: రామాపురం మండలం కల్పనాయనచెరువు గ్రామానికి చెందిన రాశమల్లు నరసింహ గారు మృతి చెందడంతో, ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిశ్చల్ నాగిరెడ్డి గారు నరసింహ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, నరసింహ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రామాపురం మండలాధ్యక్షుడు సురేందర్ రెడ్డి,పప్పిరెడ్డి వినోద్,దిలీప్,రమేష్ రెడ్డి,సహదేవరెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story




