Kadapa: ధూప దీప నైవేద్యాలకు నోచుకోని కొండా సింగరాయ స్వామి!

Kadapa: బ్రహ్మంగారి మఠంలో దేవుడికే దిక్కులేదాయె.. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని శ్రీ కొండా సింగరాయ స్వామి ఆలయం.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 9 Sept 2026 6:43 PM IST
Kadapa
X

Kadapa: ధూప దీప నైవేద్యాలకు నోచుకోని కొండా సింగరాయ స్వామి!

Kadapa: బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో అతి ప్రాచీన పురాతన దేవాలయం శ్రీ కొండా సింగరాయ స్వామి ఆలయం. ఆ ఆలయం పునర్ నిర్మాణంలో భాగంగా నెలన్నర క్రితం ఆలయాన్ని జీర్నోదరన చేయడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా శ్రీ కొండా సింగరాయ స్వామికి ధూప దీప నైవేద్యం సమర్పించిన దాఖలాలు లేవు.

శాస్త్రం ప్రకారం హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా ఒక ఆలయాన్ని జీర్ణోదరణ చేయాలనుకుంటే ముందుగా ఒక బాలలయం నిర్మించి అందులో స్వామివారి ప్రతిమ ను ఏర్పాటు చేసి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ పూజలు చేయాల్సిన అధికారులు అవేవీ చేయకుండా ఉన్న పలం గా చేయడం జరిగింది.

ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఏ రోజైనా శ్రీ కొండా సింగరాయ స్వామి ధూబు దీప నైవేద్యం సమర్పించకుండా కాలయాపన చేస్తున్నడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కేవలం 20 లక్షల రూపాయలతో ఆలయ పునర్నిర్మానం కోసం జీర్ణోదన్న పనులు చేపట్టను సభవా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.

బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో స్వామివారి స్థలం ఒక సెంటు విలువ 25 లక్షల రూపాయలు. అంతటి విలువ చేసే స్థలాలు ఉంటే కేవలం 20 లక్షల రూపాయలు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story