Mydukuru: అనారోగ్యంతో ఉన్న అర్చకుడికి బీసీ నేత తమ్మిశెట్టి ₹11,000 ఆర్థిక సాయం!
Mydukuru: వెల్లాల సంజీవరాయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు వీణా శేషచార్యులకు రూ. 11,000 ఆర్థిక సాయం అందించిన బీసీ చైతన్య సమితి సలహాదారు తమ్మిశెట్టి చిన్న సుబ్బరాయుడు దంపతులు.
Mydukuru: అనారోగ్యంతో ఉన్న అర్చకుడికి బీసీ నేత తమ్మిశెట్టి ₹11,000 ఆర్థిక సాయం!
Mydukur: వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు వీణా శేషచార్యులకు ఆదివారం ₹11,000 ఆర్థిక సహాయం అందజేశారు.
గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న జాతీయ బీసీ చైతన్య సమితి సలహాదారు, మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన తమ్మిశెట్టి చిన్న సుబ్బరాయుడు తన ధర్మపత్ని సుభద్రమ్మతో కలిసి అర్చకుడి నివాసానికి వెళ్లారు.
శేషచార్యుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, వైద్య ఖర్చుల నిమిత్తం ₹11,000 నగదును అందజేశారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థికంగా అండగా నిలిచిన చిన్న సుబ్బరాయుడు దంపతులకు అర్చకుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




