Mydukur: మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం!
Mydukur: మైదుకూరు 13వ వార్డులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం.
Mydukur: మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారం!
మైదుకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు శ్రీరామ్ నగర్ (హైస్కూల్ ఎదురుగా)లో ఎమ్మెల్యే స్థానిక ప్రజలను నేరుగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.."రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది."
రూ.25 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఇంటింటి ప్రచారం అనంతరం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) గ్రాంట్ కింద మంజూరైన రూ.25 లక్షల నిధులతో 13వ వార్డులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ పనులు త్వరలోనే పూర్తయి వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నరసింహులు, కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




