Mydukur: మైదుకూరు కేజీబీవీ హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ
Mydukur: మైదుకూరు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీ. విద్యార్థుల సమస్యలపై ఆరా.
Mydukur: మైదుకూరు కేజీబీవీ హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ
మైదుకూరు: మైదుకూరు పట్టణంలోని తెలుగు గంగా కాలనీ లో గల కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) రెసిడెన్షియల్ హాస్టల్‌లో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా హాస్టల్‌లోని డార్మెటరీలను తనిఖీ చేసి, విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు.
అలాగే వంటగదిని, త్రాగునీటి వసతులను, హాస్టల్‌లో ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలించి పలు కీలక అంశాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ తనిఖీలో గుర్తించిన పలు రకాల గ్యాప్స్‌పై సమగ్ర నివేదిక రూపొందించి గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మెడికల్ శాఖ నుండి Dy. DMHO డాక్టర్ వి. మల్లేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి. సుమధుర, MAUD నుండి మున్సిపల్ కమిషనర్ వై. రంగస్వామి, వెటర్నరీ శాఖ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సి. గురివి రెడ్డి, అగ్రికల్చర్ శాఖ నుండి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ zఎస్. శివ శంకర్,
ఎడ్యుకేషన్ శాఖ నుండి మండల విద్య శాఖ అధికారి టి.ఎం. పద్మ లత, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ASWO కె. డేవిడ్, హాస్టల్ SO విజయ, ఇంజనీరింగ్ శాఖ నుండి AE ఎల్. నిరంజన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ డి. వెంకటేశ్వర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్. పద్మావతి హెల్త్ అసిస్టెంట్ నారాయణరెడ్డి, ఏఎన్ఎమ్స్ మరియు ఆశాలు పాల్గొన్నారు.




