Mydukur: డ్రైవర్‌పై ఫారెస్ట్ సిబ్బంది దాడి, నగదు అపహరణ
Mydukur: మైదుకూరు బసాపురం టోల్గేట్ వద్ద లారీ డ్రైవర్ పై అటవీశాఖ సిబ్బంది దాడి చేసి రూ. 1.40 లక్షలు లాక్కెళ్లిన వైనం. స్పందించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి.
Mydukur: డ్రైవర్‌పై ఫారెస్ట్ సిబ్బంది దాడి, నగదు అపహరణ
మైదుకూరు: మైదుకూరు మండలం బసాపురం టోల్గేట్ వద్ద కడప అటవీశాఖ తనిఖీ సిబ్బంది అరాచకం. తనిఖీ పేరుతో ప్రొద్దుటూరు నుండి వేరుశనగకాయలను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ వద్ద నుండి 1.40 లక్షల రూపాయల డబ్బును లాక్కొని డ్రైవర్ను అమానుషంగా కొట్టిన ఫారెస్ట్ సిబ్బంది.
విజయవాడకు తీసుకెళుతున్న లోడును టోల్గేట్ వద్ద ఆపి అరాచకం సృష్టించిన ఫారెస్ట్ సిబ్బంది వెంకటేశ్వర్లు, నాగేంద్ర తదితరులు. డ్రైవర్ వద్ద ఉన్న లక్ష నలభై వేల రూపాయల బ్యాగును లాక్కొని ఎవరు మీరు అని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన సిబ్బంది.
డ్రైవర్ చాకచక్యంగా ఫోటో తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి వెళ్ళిన మైదుకూరు పోలీసులు. ఫారెస్ట్ సిబ్బందిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. డ్రైవర్ను విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన ఫారెస్ట్ సిబ్బంది.
లారీ యజమాని గోపాల్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఫిర్యాదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఫారెస్ట్ సిబ్బందిని తీవ్రంగా మందలించిన వైనం. తనిఖీల పేరుతో లారీ డ్రైవర్లను యజమానులను వేధిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది అరాచకాలను అరికట్టి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.




