Proddatur: కొత్త మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాస్ ఎంట్రీ

Proddatur: మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెల్లవారుజామున 5 గంటలకే సైకిల్‌పై వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 28 July 2026 8:42 PM IST
Proddatur
X

Proddatur: కొత్త మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాస్ ఎంట్రీ

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలిక కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ పట్టణంలో పారిశుద్ధ్య రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా రంగంలోకి దిగారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన తన సిబ్బందితో కలిసి సైకిల్‌పై వార్డులో పర్యటించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ​ఈ రోజు ఉదయం ఐదు గంటలకే పారిశుద్ధ్య కార్మికుల మ్యాస్టర్ రోల్స్‌ను స్వయంగా తనిఖీ చేసిన కమిషనర్, ఫస్ట్ డివిజన్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు పలు కీలక సూచనలు చేశారు.

​శానిటేషన్ పనులు క్రమబద్ధంగా జరగడానికి ప్రాంతాలవారీగా మ్యాపింగ్ సిద్ధం చేసి, పనులను నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రొద్దుటూరు ప్రజలందరూ మెచ్చుకునేలా పారిశుద్ధ్యంలో స్పష్టమైన మార్పు తెస్తామని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే, వ్యాపార యజమానులతో కూడా సమావేశం నిర్వహించి, పట్టణ పరిశుభ్రతలో వారి సహాయ సహకారాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story