Proddatur: పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి!

Proddatur: ప్రొద్దుటూరులో 46 మంది లబ్ధిదారులకు ₹35.24 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. ఇప్పటివరకు ₹12.22 కోట్లు అందజేత.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 16 Sept 2026 1:34 PM IST
Proddatur
X

Proddatur: పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి!

Proddatur: కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య అవసరాల కోసం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబందించిన 31 విడత సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కుల పంపిణి లో భాగంగా టిడిపి కార్యాలయం లో నేడు 46 మందికి 35 లక్షల రూపాయలు 24 వేల సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేశాం అన్నారు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వo ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేయడంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు రెండో, మూడు స్థానంలో ఉంది అన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గం సంబందించిన 1401 మందికి సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కులు అందచేశాం పేదలకు సిఎం రిరిఫ్ ఫండ్ చెక్కులు ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం 31 విడతలకు గాను సుమారుగా 12 కోట్ల 22 లక్షల 95 వేల రూపాయలు పంపిణి చేశాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు అనారోగ్యానికి గురై ఆర్థిక సహాయం చేసే భాగంలో వెనుకబడిన పేద ప్రజల కోసం ఈ సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్లు జాకీర్, శ్రీనివాస ఆచార్య, మార్కెట్ యార్డ్ ఇన్చార్జి చైర్మన్ లక్ష్మణ్, మాజీ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఘంటా వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చల్లా రాజాగోపాల్, మాజీ జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సీతారామరెడ్డి, సుధాకర్ రెడ్డి, పెన్నా నగర్ నూరి, తదితరులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR