Proddatur: ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వరదరాజుల సమీక్ష
Proddatur: ప్రొద్దుటూరు పట్టణంలోని అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్షించి, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Proddatur
Proddatur: ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమీక్ష నిర్వహించారు. పురపాలక కమిషనర్ రవిచంద్ర రెడ్డితో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారుల మరమ్మత్తు పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా రాజుపాలెం మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో తలెత్తిన తాగునీటి సమస్యను గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story




