Madanapalle: మదనపల్లిలో ఉచిత యువ కోర్స్.. ఎమ్మెల్యే ఆవిష్కరణ!

Madanapalle: మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో పినాక ప్రజా సాధికారిక ట్రస్ట్ 13వ ఉచిత యువ కోర్స్ పోస్టర్ ఆవిష్కరణ.

Srinivasulu, Madanapalle
Published on: 5 May 2026 12:50 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లిలో ఉచిత యువ కోర్స్.. ఎమ్మెల్యే ఆవిష్కరణ!

Madanapalle: మదనపల్లి, మంగళవారం (05-05-2026): పినాక ప్రజా సాధికారిక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 13వ ఉచిత యువ కోర్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొని ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. యువత అభివృద్ధి, నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ఈ కోర్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు కప్పల శ్రీరాములు, కోర్స్ డైరెక్టర్ శ్రీమతి కొప్పల లలితకుమారి, ఆర్టీసీ రమణ, బండి రెడ్డప్ప, సూరీడు, కొప్పల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా నిర్వహిస్తున్న ఈ యువ కోర్స్ ద్వారా స్థానిక యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story