Thamballapalle: కూటమి సర్కార్‌పై ద్వారకనాథ్ రెడ్డి ఫైర్

Thamballapalle: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నిప్పులు.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE
Published on: 3 Jun 2026 2:21 PM IST
Thamballapalle
X

Thamballapalle: కూటమి సర్కార్‌పై ద్వారకనాథ్ రెడ్డి ఫైర్

తంబళ్లపల్లె: బి.కొత్తకోటలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ప్రతినెల ఇవ్వాల్సిన 1500 రూపాయలు,నిరుద్యోగ భృతి,కొత్త పెన్షన్లు ఇంతవరకు మంజూరు చేయలేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.

రేపటినుండి 12వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రాలలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో తంబళ్లపల్లి నియోజకవర్గానికి జరిగినటువంటి అన్యాయం ఏ నియోజకవర్గానికి జరగలేదని, గతంలో జరిగిన అభివృద్ధిని కూడా అడ్డుకున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని దుయ్యపెట్టిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.

తంబళ్లపల్లి లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ, సాధు కొండలో మైనింగ్ పేరుతో వాటి జోలికి వస్తే చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉన్నామన్న ఎమ్మెల్యే. తంబళ్లపల్లి నియోజకవర్గం లోని ప్రజలందరూపార్టీలకు,కులాలకు,మతాలకు అతీతంగా మల్లయ్య కొండల్లో నిర్వహించే మైనింగ్ లను అడ్డుకోవడానికి కలిసికట్టుగా రావాలన్న ఎమ్మెల్యే , కూటమి నాయకులు సహకరించక పోయిన ఈ ఉద్యమం ఆగదన్న ఎమ్మెల్యే.

మాపై కక్ష కట్టిన చంద్రబాబు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో రెండు సంవత్సరాలు కావస్తున్న ఎందుకు సిబిఐ విచారణ జరపలేదని మేం తప్పు చేసినట్టు ఎందుకు నిరూపించలేకపోతున్నారని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే. మదనపల్లి ఫైల్స్ కేసు విషయంలో 22A భూములను సొంత కార్యకర్తల పేరిట అధికారులను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మా ప్రభుత్వం రాగానే మొత్తం బయటకు తీసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామన్న ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి...

నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని దమ్ముంటే లోకేష్ కానీ చంద్రబాబు కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో నాపై పోటీ చేసి గెలిచే దమ్ముందా అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి.

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

RAMAKRISHNA REDDY, THAMBALAPALLE

Next Story