Proddatur: బొల్లవరంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇంటింటి ప్రచారం!

Proddatur: ప్రొద్దుటూరు బొల్లవరం 1వ వార్డులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో మూడో రోజు డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది.

G. RAVI KUMAR, KADAPA
Published on: 29 July 2026 5:00 PM IST
Proddatur
X

Proddatur: బొల్లవరంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇంటింటి ప్రచారం!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా నేడు మూడవరోజు బొల్లవరం 1వ వార్డులో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమం కొనసాగింది.

స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ కూటమి నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఒకటవ వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో స్వయంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ప్రభుత్వం అందించిన సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రొద్దుటూరును ముందుంజలో ఉంచుతాం ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు యనమల రామసుబ్బారెడ్డి, యనమల సుబ్బిరెడ్డి, బొగ్గుల సుబ్బారెడ్డి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story