Rayachoti: రాయచోటిలో ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం!

Rayachoti: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రాజంపేట ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ శ్రేణులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 11 Sept 2026 11:54 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం!

Rayachoti: రాయచోటి వైఎస్ఆర్ సిపి కార్యాలయం లో ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రాజంపేట ఎంపీ, వైఎస్ఆర్ సిపి లోక సభపక్ష నేత పివి మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌ కాలనీలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని కేక్‌ కట్‌ చేసి మిథున్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మిథున్‌రెడ్డి సేవలను నాయకులు కొనియాడారు. ప్రజా జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ.. మిథున్‌రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story