Annamayya: వీరబల్లి డిఎంఎఫ్ నిధుల దుర్వినియోగం అధికారులపై విమర్శలు!

Annamayya: వీరబల్లి మండలం వంగిమళ్ళలో డిఎంఎఫ్ నిధుల దుర్వినియోగం. బాగున్న రోడ్డుపైనే మళ్లీ మెటల్ రోడ్డు పనులు చేపట్టడంపై స్థానికుల ఆగ్రహం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 25 Aug 2026 9:12 AM IST
Annamayya
X

Annamayya: వీరబల్లి డిఎంఎఫ్ నిధుల దుర్వినియోగం అధికారులపై విమర్శలు!

Annamayya: కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామంలో కూటమి నాయకులు మాయాజాలం సృష్టిస్తున్నారు. పెద్దహరిజనవాడలో పంట పొలాల కు వెళ్లే దారికి ఈ ఏడాది ఫిబ్రవరి 28న పంచాయతీరాజ్ శాఖ నిధులు 3 లక్షల నిధులతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేశారు. నేడు అదే రోడ్డు పై 22 లక్షలు డిఎంఎఫ్ నిధులతో మెటల్ రోడ్డు పనులు చేపట్టారు. 5 నెలలు గడవక ముందే రోడ్డు పై రోడ్డు వేస్తుండడం పై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఈ రోడ్డు పై రోడ్డు పనులకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. బాగున్న రోడ్డు పై అవసరం లేని చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టి నాసిరకంగా పనులు చేస్తున్నారు. నాణ్యత ను గాల్లోకి వదిలేసి పైసలు కోసం టిడిపి నాయకుడు, కాంట్రాక్టర్ కల్లూరి రామ్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు కుమ్మక్కై రోడ్డు పై రోడ్డు వేస్తూ డిఎంఎఫ్ నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ప్రజాధనాన్ని ల్యూటీ చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టించుకోవాల్సిన సంబంధిత అధికారులు అటువైపు కన్ను ఎత్తి చూడకపోవడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story