Rayachoti: రాయచోటిలో మంత్రుల కీలక సమీక్ష స్థానిక ఎన్నికలపై వ్యూహం!
Rayachoti: రాయచోటిలో మంత్రులు మండిపల్లి, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌ల కీలక సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష.
Rayachoti: రాయచోటిలో మంత్రుల కీలక సమీక్ష స్థానిక ఎన్నికలపై వ్యూహం!
Rayachoti: రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు,విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
“అభివృద్ధి ఆగకూడదు.. ప్రజా సంక్షేమం ఆగకూడదు.. రాయచోటి ప్రగతి పరుగులు తీయాలి” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి, రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎలా ముందుకు సాగాలి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధిని ఒక వైపు.. సంక్షేమాన్ని మరో వైపు.. ప్రజా సేవను ప్రధాన అజెండాగా చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాయచోటి అభివృద్ధే లక్ష్యం.. ప్రజల సంక్షేమమే ధ్యేయం.. కూటమి ఐక్యతే బలం అనే సంకల్పంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రుల ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు, కార్యాచరణపై చర్చ జరిగింది.




