Rayachoti: డీలర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి సతీమణి హరితమ్మ

Rayachoti: చిన్నమండెం మండలంలో జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీమతి హరితమ్మ పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 14 July 2026 5:54 PM IST
Rayachoti
X

Rayachoti: డీలర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి సతీమణి హరితమ్మ

Rayachoti: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి హరితమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరితమ్మ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో, నాణ్యతతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించడం ప్రతి డీలర్ బాధ్యత అని సూచించారు.

ప్రజలకు మర్యాదపూర్వకంగా సేవలందిస్తూ ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిన్నమండెం మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప గారు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రసాద్ రాజు మండలంలోని 26 మంది రేషన్ డీలర్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story