Mandipalli: చిన్నమండెం మండలంలో నూతన అంగన్వాడీల ప్రారంభం!
Mandipalli: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలో నూతన అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
Mandipalli: చిన్నమండెం మండలంలో నూతన అంగన్వాడీల ప్రారంభం!
మండిపల్లి: చిన్నమండెం మండలంలోని దిగవగొట్టివీడు కస్పా మరియు రామాపురం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రెండు అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరితమ్మ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు, గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలతో అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప గ్రామ అధ్యక్షులు నాగేశ్వర తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story




