Rayachoty: లక్కిరెడ్డిపల్లిలో కార్యకర్త బిడ్డను ఆశీర్వదించిన మంత్రి

Rayachoty: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంట పల్లెలో టిడిపి సీనియర్ కార్యకర్త సయ్యద్ రిజ్వాన్ నివాసానికి ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 19 July 2026 8:45 AM IST
Rayachoty
X

Rayachoty: లక్కిరెడ్డిపల్లిలో కార్యకర్త బిడ్డను ఆశీర్వదించిన మంత్రి

Rayachoty: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంట పల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త సయ్యద్ రిజ్వాన్ , సయ్యద్ తౌసేప్ దంపతులు ఇటీవల కాలంలో మగ బిడ్డకు జన్మించారు.

దీంతో లక్కిరెడ్డిపల్లి మండలం లో పర్యటిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సమాచారం అందించడంతో నేరుగా చింతకుంట పల్లెలోని వారి ఇంటికి వెళ్లి బిడ్డను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆశీర్వదించాడు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా తమ ఇంటికి విచ్చేసి తమ బిడ్డకు ఆశీర్వదించడంతో కుటుంబ సభ్యులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

టిడిపి లో ఉన్న ఒక చిన్న కార్యకర్తను గుర్తించి స్వయంగా తన ఇంటికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రావడంతో రిజ్వాన్ కుటుంబ సభ్యులు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story