Galiveedu: గాలివీడులో కిసాన్ మేళా 2026: ప్రారంభించిన మంత్రి మండిపల్లి!
Galiveedu: కిసాన్ మేళా 2026. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆధునిక సాగు విధానాలతో అధిక లాభాలు పొందాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపు.
Galiveedu: గాలివీడులో కిసాన్ మేళా 2026: ప్రారంభించిన మంత్రి మండిపల్లి!
గాలివీడు: ప్రజల కష్టాలను తెలుసుకుంటూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ.. వారి సమస్యల పరిష్కారానికి భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టాలను స్వయంగా తెలుసుకోవడం.. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడం.. అర్హులకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం.. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయడమే లక్ష్యంగా శ్రీకాంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.
గురువారం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రాచపల్లి గ్రామంలో పర్యటించిన శ్రీకాంత్ రెడ్డి ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడిన మాజీ డీలర్ రామరాజు కుమారుడు సంగరాజు నాగేశ్వరరాజు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం హసనాపురం వెంకటరామ కుమారుడు వెంకట శివకు వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు మంజూరు కాలేదని తల్లిదండ్రులు శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. గ్రామంలో రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొత్త ఇళ్లు, కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని పలువురు గ్రామస్తులు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకు కొత్త పెన్షన్లు మంజూరయ్యేవని, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేవని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసం ఎదురుచూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన హసనాపురం రామయ్యను శ్రీకాంత్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, రామయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కొవ్వురివాండ్లపల్లికి చెందిన వాసుదేవరెడ్డి కుమారుడు ఇటీవల ప్రమాదవశాత్తు చెయ్యి విరిగి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి, ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
బీదవాండ్లపల్లెలో...
బీదవాండ్లపల్లెలో పలువురి వైఎస్ఆర్ సిపి నాయకుల ఇళ్ళ వద్దకు శ్రీకాంత్ రెడ్డి వెళ్లి తేనీటి విందును స్వీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గడ్డం నాగసుబ్బారెడ్డి సతీమణి సులోచనమ్మ ను ఆయన పరామర్శించారు.
రాచపల్లె గ్రామం పొలిమేరపల్లె కు చెందిన మాజీ డీలర్ రహీం ఖాన్ మనుమడు వలీకి ఇటీవల వివాహం అయ్యింది. ఈ సందర్భంగా వారి నివాసానికి శ్రీకాంత్ రెడ్డి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సరస్వతిపల్లె గ్రామంలో...
సరస్వతిపల్లె లో పార్టీ కార్యకర్త జనార్దన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనార్దన నివాసానికి శ్రీకాంత్ రెడ్డి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు.




