Rayachoti: రూ.92 లక్షల బీటీ రోడ్డు ప్రారంభం.. స్వయంగా బైక్ నడిపిన మంత్రి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్‌లో రూ.92 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 14 Aug 2026 5:13 PM IST
Rayachoti
X

Rayachoti: రూ.92 లక్షల బీటీ రోడ్డు ప్రారంభం.. స్వయంగా బైక్ నడిపిన మంత్రి!

రాయచోటి: RKT రోడ్డు నుంచి పాలెం వాండ్ల పల్లె వరకు 1.2 కిలోమీటర్ల మేర రూ.92 లక్షల NRGS నిధులతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

రోడ్డు ప్రారంభించిన అనంతరం మంత్రి స్వయంగా బైక్ నడుపుతూ కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, రహదారి పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాలెం వాండ్ల పల్లె గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమైన మంత్రి వారి సమస్యలను, రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

కొత్తగా నిర్మించిన ఈ బీటీ రోడ్డు అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడం.. అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడం.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందించడం.. ఇదే మండిపల్లి మార్క్ అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story