Rayachoty: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoty: రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అర్జీల స్వీకరణ.
Rayachoty: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoty: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో రాయచోటిలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి S N కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను స్వయంగా విని అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించగా, ప్రతి అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.




