Rayachoti: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్. స్వగృహంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Rayachoti: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
రిపోర్టర్ N సూర్య ప్రకాష్ రాజు
రాయచోటి, అన్నమయ్య జిల్లా.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం, పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకురాగా, ప్రతి వినతిని ఓర్పుగా ఆలకించి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




