Chinnamandem: సమస్యల్లేని సమాజమే భవిష్యత్తుకు భరోసా మంత్రి మండిపల్లి!

Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Aug 2026 10:52 AM IST
Chinnamandem
X

Chinnamandem: సమస్యల్లేని సమాజమే భవిష్యత్తుకు భరోసా మంత్రి మండిపల్లి!

Chinnamandem: చిన్నమండెం మండలం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి స్వగ్రామమైన బోరెడ్డిగారి పల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సమస్యలు లేని సమాజం ఏర్పడితేనే భవిష్యత్‌కు భరోసా అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story