Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్!

Rayachoti: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరణ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 Sept 2026 7:23 PM IST
Rayachoti
X

Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్!

Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తన సొంత నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి గారు స్వయంగా కలుసుకుని వారి సమస్యలు, వినతులను తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సావధానంగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI