Rayachoti: నడింపల్లి అశోక్‌కు మండిపల్లి కుటుంబం కన్నీటి వీడ్కోలు!

Rayachoti: ముల్లూరు కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నడింపల్లి అశోక్ అంతిమయాత్రలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 4:38 PM IST
Rayachoti
X

Rayachoti: నడింపల్లి అశోక్‌కు మండిపల్లి కుటుంబం కన్నీటి వీడ్కోలు!

రాయచోటి: మండిపల్లి కుటుంబానికి వీరాభిమానిగా ఉన్న నడింపల్లి అశోక్ ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముల్లూరు కొత్తపల్లి లో జరిగిన ఆయన అంతిమయాత్రలో మండిపల్లి కుటుంబ సభ్యులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, మంత్రి సతీమణి హరితమ్మ గారు, మంత్రి మేనల్లుడు మౌర్యా రెడ్డి గారు, మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు కుటుంబ సమేతంగా అంతిమయాత్రలో పాల్గొని అశోక్‌కు తుది నివాళులు అర్పించారు.

మండిపల్లి కుటుంబంపై ఎంతో అభిమానం చూపించిన అశోక్ అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మండిపల్లి కుటుంబ సభ్యులు ప్రార్థించారు. ఈ అంతిమయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అశోక్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story