Rayachoti: సాయి గణేష్ హల్దీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటి వాసవి కళ్యాణ మండపంలో జరిగిన సాయి గణేష్ హల్దీ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

Rohith
Published on: 27 Aug 2026 3:21 PM IST
Rayachoti
X

Rayachoti: సాయి గణేష్ హల్దీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి!

రాయచోటి: రాయచోటి టౌన్‌లోని వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగిన సాయి గణేష్ హల్దీ ఫంక్షన్ వేడుకల్లో మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా సాయి గణేష్‌కు హల్దీ వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆత్మీయత మధ్య జరిగిన ఈ వేడుకలో మంత్రి గారి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Rohith

Rohith

Next Story