Rayachoty: రాయచోటిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభించిన మంత్రి!

Rayachoty: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను రవాణా, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Aug 2026 1:37 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభించిన మంత్రి!

Rayachoty: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.

తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంతో పాటు, ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేలా ప్రభుత్వం సేవలు అందిస్తోందన్నారు.

తల్లులు, బిడ్డల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ ప్రసాద్ గారు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story