Rayachoti: చిన్నమండెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్!

Rayachoti: చిన్నమండెంలోని స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Sept 2026 2:31 PM IST
Rayachoti
X

Rayachoti: చిన్నమండెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్!

Rayachoti: చిన్నమండెం మండలం బో రెడ్డి గారి పల్లెలోని తన సొంత నివాసంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి గారు ఆత్మీయంగా కలుసుకుని వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వివరించేలా సమయం కేటాయిస్తూ, ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్నారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి గారు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తూ మంత్రి గారు ముందుకు సాగుతున్నారు.

ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. పరిష్కారమే ధ్యేయంగా కొనసాగుతున్న ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI