Rayachoty: కుటుంబ సమేతంగా హోమాల్లో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Rayachoty: చిన్నమండెం మండలంలో వైభవంగా సాగుతున్న శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఉత్సవాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 July 2026 7:21 AM IST
Rayachoty
X

Rayachoty: కుటుంబ సమేతంగా హోమాల్లో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Rayachoty: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామ పంచాయతీ పరిధిలోని బోరెడ్డిగారిపల్లిలో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమ, యజ్ఞ కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన సతీమణి శ్రీమతి హరితమ్మ గారు, కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారితో కలిసి వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన హోమ, యజ్ఞాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సస్యశ్యామలత కలగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

హోమ, యజ్ఞ కార్యక్రమాలు ముగిసిన అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన మహా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, మహిళలు, యువత, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తి, సేవాభావం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story