Rayachoti: విశాఖలో ఘనంగా BRICS యువజన, క్రీడా మంత్రుల సదస్సు!

Rayachoti: విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ BRICS యువజన, క్రీడా మంత్రుల సదస్సులో పాల్గొన్న ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Aug 2026 11:10 AM IST
Rayachoti
X

Rayachoti: విశాఖలో ఘనంగా BRICS యువజన, క్రీడా మంత్రుల సదస్సు!

Rayachoti: విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన BRICS యువజన మరియు క్రీడా మంత్రుల సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

భారత్‌ BRICS అధ్యక్షతలో నిర్వహించిన ఈ సదస్సులో యువత, క్రీడల అభివృద్ధి, సాంకేతికత, స్టార్టప్‌లు, క్రీడా మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ విద్య, స్టార్టప్‌ ప్రోత్సాహక కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో ఆధునిక సాంకేతికత, స్పోర్ట్స్‌ సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, ఆధునిక శిక్షణా విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

BRICS దేశాల మధ్య యువజన మార్పిడి, క్రీడా సాంకేతికత, క్రీడా మౌలిక వసతులు, స్పోర్ట్స్‌ టూరిజం రంగాల్లో పరస్పర సహకారం పెంచుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, BRICS దేశాల మంత్రులు, ఉపమంత్రులు, ఉన్నతాధికారులు, ప్రతినిధులతో పాటు విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా వీరభద్రాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నంలో జరిగిన BRICS సదస్సు ద్వారా యువత, క్రీడల రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి మరింత బలమైన పునాది ఏర్పడిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story