Rayachoti: భైరవేశ్వర స్వామి ఆలయ కాంపౌండ్ వాల్ పనులకు భూమిపూజ!

Rayachoti: రాయచోటి రామాపురం భైరవేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ 26 లక్షలతో కాంపౌండ్ వాల్ పనులకు భూమిపూజ చేసిన మంత్రి మండిపల్లి.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 4 Sept 2026 3:48 PM IST
Rayachoti
X

Rayachoti: భైరవేశ్వర స్వామి ఆలయ కాంపౌండ్ వాల్ పనులకు భూమిపూజ!

Rayachoti: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం బండపల్లి గ్రామం వెంకటరెడ్డి గారి పల్లెలో వెలసిన శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం మంజూరైన రూ.26 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలోపేతం అవుతుందని, గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు అధికారులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story