Rayachoti: రూ.10.84 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి శ్రీకారం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో రూ.10.84 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్ల పనులకు భూమిపూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Sept 2026 1:43 PM IST
Rayachoti
X

Rayachoti: రూ.10.84 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి శ్రీకారం!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పురపాలకలో రూ.10.84 కోట్లతో చేపట్టిన సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి పైప్లైన్ల పనులకు భూమి పూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

రాయచోటి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు.

కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్లు, తాగునీటి పైప్‌లైన్లు, హెచ్‌డీపీఈ పైప్‌లైన్లు, మధ్య డివైడర్లు, సుందరీకరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా రాయచోటి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI