Rayachoti: రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం!

Rayachoti: రాయచోటి కృష్ణాపురం-సుద్దలవాండ్లపల్లి రోడ్డులో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 16 Sept 2026 1:40 PM IST
Rayachoti
X

Rayachoti: రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం!

Rayachoti: రాయచోటి పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు.

కృష్ణాపురం–సుద్దలవాండ్లపల్లి రోడ్డులో రూ.35 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, అవసరమైన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కృష్ణాపురం–సుద్దలవాండ్లపల్లి రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. రాయచోటి పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI