Rayachoty: 75 వేల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి మంత్రి మండిపల్లికి ఆహ్వానం

Rayachoty: విజయవాడలో 75 వేల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం పలికిన CII Young Indians ప్రతినిధులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 20 Aug 2026 9:58 AM IST
Rayachoty
X

Rayachoty: 75 వేల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి మంత్రి మండిపల్లికి ఆహ్వానం

Rayachoty: విజయవాడలో ఈ నెల 29న నిర్వహించనున్న భారీ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని Young Indians (Yi) అమరావతి చాప్టర్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో ఒకే రోజు, ఒకే వేదికపై 75 వేలకుపైగా సీడ్ బాల్స్ తయారు చేసి రికార్డు సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story