Rayachoty: రాయచోటిలో 48 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ!
Rayachoty: రాయచోటి టీడీపీ కార్యాలయంలో 48 మందికి రూ.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoty: రాయచోటిలో 48 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ!
Rayachoty: రాయచోటిలో 48 మందికి రూ.40 లక్షల CMRF చెక్కుల పంపిణీ
అన్నమయ్య జిల్లా రాయచోటి (ఎస్.ఎన్. కాలనీ): తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 48 మంది లబ్ధిదారులకు సుమారు రూ.40 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. అనారోగ్యం, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




