Proddatur: జగనన్న ఇళ్ల పేరుతో కోట్ల దోపిడీ జరిగింది.. పార్థసారథి

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు జగనన్న లేఅవుట్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 13 Jun 2026 4:54 PM IST
Proddatur
X

Proddatur: జగనన్న ఇళ్ల పేరుతో కోట్ల దోపిడీ జరిగింది.. పార్థసారథి

Proddatur: వైసిపి హయాంలో జగనన్న గృహ పథకాన్ని వైసిపి ప్రభుత్వం దోపిడీ చేయడానికి ఏర్పాటు చేసుకుందని.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఇళ్లలో కోట్ల రూపాయలు వైసిపి నేతలు దోచుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా నేడు మంత్రి ప్రొద్దుటూరులోని జగనన్న లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను పరిశీలించారు.

అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. డబ్బు కట్టించుకున్న కాంట్రాక్టర్ తమకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని మంత్రికి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.

జగనన్న లేఔట్లలో ఇంటి నిర్మాణాల కోసం ప్రజల వద్ద నుంచి డబ్బు తీసుకొని ఇంటి నిర్మాణాలను పూర్తి చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్లపై ఇంత వరకు ఎందుకు కేసులు పెట్టలేదని గృహ నిర్మాణ శాఖ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణం కొరకు నేరుగా ప్రజల వద్ద నుంచి 35 వేల రూపాయలు అప్పటి మునిసిపల్ కమిషనర్ కాంట్రాక్టర్లకి ఇప్పించారని దీనిపై కూడా విచారణ చేపట్టామని మంత్రి తెలిపారు. జగన్నన్న లేఅవుట్ లలో జరిగిన అక్రమాలపై త్వరలో పూర్తి విజరణ చేసి బాధ్యులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story