Rayachoty: తల్లికి వందనం ఫేక్ లింకులపై రవాణా మంత్రి కీలక సూచనలు!

Rayachoty: రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో తల్లికి వందనం పథకం ద్వారా 67.47 లక్షల మందికి రూ. 10,120 కోట్ల సాయం అందుతోందని తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 22 July 2026 4:35 PM IST
Rayachoty
X

Rayachoty: తల్లికి వందనం ఫేక్ లింకులపై రవాణా మంత్రి కీలక సూచనలు!

రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేయడం ప్రారంభించడం పట్ల రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నారని అన్నారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రతి తల్లికి అండగా నిలిచే ఈ పథకం రాష్ట్ర భవిష్యత్తులో పెట్టుబడి అని పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సమన్వయంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

ఒక కుటుంబంలో ఎంత మంది అర్హులైన పిల్లలు చదువుకుంటే అంత మంది విద్యార్థులకు పథకం వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల తన నిబద్ధతను చాటుకుందని అన్నారు. ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు, 10,120.78 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం గొప్ప భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.

కొత్తగా ప్రవేశాలు పొందిన అర్హులైన విద్యార్థులకు కూడా నిర్ణీత గడువులో ఈ పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని మంత్రి అన్నారు.ఈ సందర్భంగా తల్లికి వందనం పేరుతో వచ్చే ఫేక్ లింకులు, మోసపూరిత సందేశాలను నమ్మవద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story