Kadapa: అప్పు తీర్చలేదని దారుణం.. వ్యక్తిని కొట్టి చంపిన దంపతులు!
Kadapa: కడప జిల్లా వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామంలో అప్పు డబ్బుల గొడవలో చిన్న వెంకటరమణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
Kadapa: అప్పు తీర్చలేదని దారుణం.. వ్యక్తిని కొట్టి చంపిన దంపతులు!
Kadapa: కడప జిల్లా వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం పెద్దహరిజనవాడలో దారుణం చోటు చేసుకుంది. అప్పు గా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో చిన్న వెంకటరమణ(50) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన సహదేవ, నారాయణమ్మ దంపతులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేశారు.
గాయపడ్డ చిన్న వెంకటరమణ ను స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్న వెంకటరమణ మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ఘటన పై విచారణ చేపట్టారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




