Duvvuru: మన్నెరంపల్లె గ్రామంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పర్యటన!

Duvvuru: దువ్వూరు మండలం మన్నెరంపల్లెలో నిర్వహించిన 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 7 Aug 2026 2:32 PM IST
Duvvuru
X

Duvvuru: మన్నెరంపల్లె గ్రామంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ పర్యటన!

Duvvuru: దువ్వూరు మండలం మన్నెరంపల్లెలో "ఇంటింటికి టీడీపీ" కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమస్యలను స్వయంగా ఆలకించారు.

గ్రామస్థులు పలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొంటూ, ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ ఇన్‌చార్జీలు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story