Rayachoti: రాయచోటి వద్ద టమోటా లారీ బోల్తా.. NH-40 పై స్తంభించిన ట్రాఫిక్!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని ఎర్రగుంట్ల NH-40 వద్ద టమోటా లోడు లారీ బోల్తా పడింది.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 28 July 2026 10:43 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి వద్ద టమోటా లారీ బోల్తా.. NH-40 పై స్తంభించిన ట్రాఫిక్!

రాయచోటి (అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా రాయచోటికి సమీపంలోని ఎర్రగుంట్ల NH-40 వద్ద భారీ ప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి కడప మీదుగా రాజస్థాన్‌కు టమోటా లోడుతో వెళ్తున్న RJ11 GC 4308 నెంబర్ గల లారీ ఎర్రగుంట్ల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

లారీ NH-40 జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై టమోటాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసు సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story