Rayachoty: ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్!
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
Rayachoty: ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్!
రాయచోటి: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో రాయచోటి వాస్తవ్యులు కీ:శే: పాలగిరి దస్తగిరి 7 వ వర్ధంతి సందర్బంగా ఆయన కుమార్తె నాగేశ్వరి గారి ఆర్థిక సహాయం తో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బెడ్లు పంపిణీ చేయడం జరిగిందని డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ షేక్.మహమ్మద్ తెలిపారు.
అనంతరం దాత నాగేశ్వరి మాట్లాడుతు ఈ రోజు మా తండ్రి కి:శే:పాలగిరి దస్తగిరి గారి 7 వ వర్ధంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారు చేస్తున్న సేవలను చూసి నా వంతుగా ప్రజలకు సేవ చేయాలని ఈ రోజు రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్ వి.హరీష్ చంద్ (బబ్లూ), డా.ధరణి కుమార్,వినోద్ కుమార్ నాయక్,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.




