Badvel: బి.కోడూరు మండలంలో ప్రభుత్వ భూమి ఆన్‌లైన్ నమోదు వివాదం!
Badvel: కడప జిల్లా బి.కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలో ప్రభుత్వ భూమి ఆన్‌లైన్ నమోదు వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ, అధికారులకు బాధితుల విజ్ఞప్తి.
Badvel: బి.కోడూరు మండలంలో ప్రభుత్వ భూమి ఆన్‌లైన్ నమోదు వివాదం!
Badvel: బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామ పొలంలో సర్వేనెంబర్ 1857 ప్రభుత్వ భూమి విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది. కొంతకాలంగా ప్రభుత్వ భూమిని ముద్దం ఓబయ్య అనే వ్యక్తి తన అనుభవంలో ఉంచుకుని సాగు చేసుకుంటున్నట్లు సమాచారం.అయితే అదే భూమిని ఆన్‌లైన్‌లో పెద్ద చెర్ల కేశవయ్య అనే మరో వ్యక్తి పేరుపై నమోదు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది.
దీంతో ఇరువర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగగా, పరిస్థితి ఘర్షణకు దారితీసింది. భూమి విషయంలో తమకు న్యాయం చేయాలని 20 సంవత్సరాల నుండి అనుభవంలో ఉన్నామని ముద్ధం ఓబయ్య అధికారులను వేడుకుంటున్నాడు.
ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌లో ఇతరుల పేరుపై నమోదు చేయించే ప్రయత్నాలు జరిగాయా? అనే అంశంపై అధికారులు సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.భూమికి సంబంధించిన అసలు హక్కులు, రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్ నమోదుపై అధికారులు పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని లేదంటే చట్టం ప్రకారం ఎవరికి లేకుండా ఈ వివాదానికి కారణమైన భూమిలో ప్రభుత్వ భూమి అని బోర్డు నాటాలని బాధితులు ముద్దం ఓబయ్య, ముద్ధం లక్ష్మి, అధికారులను వేడుకుంటున్నారు




