Badvel: వార్డెన్ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి!

Badvel: బద్వేల్ గుంతపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ మధుసూదన్ రెడ్డి అవినీతిపై కేవీపీఎస్ నేతలు మండిపడ్డారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 1 Aug 2026 4:55 PM IST
Badvel
X

Badvel: వార్డెన్ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి!

బద్వేల్: బద్వేల్ మున్సిపాలిటీలో గుంతపల్లి క్రాస్ ఎస్సీ హాస్టల్ ఇంటర్, ఐటిఐ , డిగ్రీ విద్యార్థులు దాదాపు 90 మంది ఉండగా సౌకర్యాలు విద్యార్థులకు ఉండే హాస్టల్స్ లో ప్రైవేట్ వ్యక్తులకి దాన్ని నెలకు 20000 రూపాయలు సంవత్సరానికి ₹2,40,000 రూపాయలు బాడుగ ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఇంటి ఓనర్ తో వార్డెన్ కమిషన్ తీసుకుంటూ సౌకర్యం లేని హాస్టల్ గా విద్యార్థులను అసౌకర్యంగా, విద్యార్థులు చదువుకోవడానికి ఆడుకోవడానికి సౌకర్యం లేని హాస్టల్స్ తీసుకొని ఏళ్ల తరబడి కాలం గడుపుతున్నాడ. అలాంటి అవినీతి వార్డెన్ మధుసూదన్ రెడ్డి పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కె.వి.పిఎ.స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జికరయ్య, జిల్లా అధ్యక్షులు రఘు అన్నారు.

శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బద్వేల్ పట్టణం లో గుంతపల్లి ఎస్సి హాస్టల్ ఉన్నది అందులో దాదాపు 9 మంది విద్యార్థులు ఉండగా మంచి ఆహారం పౌష్టిక ఆహారం అందించాలి. ప్రభుత్వ లక్ష్యం దానికి అనుగుణంగా వార్డెన్ కమిషన్లతో ఏదైతే ఆహారం అందించాలని ఆహారంలో కటింగ్ చేస్తూ మిగిల్చుకొని కోట్లాది రూపాయలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, మూడు హాస్టల్స్ ఇన్చార్జి తీసుకొని పిల్లలకు ఎటువంటి న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నటువంటి వార్డెన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన సంబంధిత అధికారుల ప్రశ్నించారు.

అంతేకాదు వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలి ఐదు రోజులు అరటిపండు ఇవ్వాలి 175 గ్రాములు, చికెన్ ఇవ్వాలి 200 గ్రాములు పాలు ఇవ్వాలి 5.4 గంటలకు స్నాక్స్ ఇవ్వాలి అయితే వార్డెన్ మధుసూదన్ రెడ్డి సొంత పట్టిక పిల్లలకి చాలా హారం వారానికి రెండు సార్లు గుడ్డు, స్నాక్స్ సాయంకాలం రెండు వారాలకు రెండు సార్లు, అరటిపండు,100 గ్రాములు మూడు,నాలుగు ముక్కలు చికెన్ ఇస్తున్నారు.నాలుగు గంటలకు స్నాక్స్ ఇవాళ వాటిబదులు చిక్కిళ్ళు ఇస్తున్నారు.

ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వార్ధన్ మధుసూదన్ రెడ్డి పై జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. ఇలా జిల్లా అధికారులకు మామూలు ఇస్తూ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నటువంటి అవినీతి వార్డెన్ మధుసూదన్ రెడ్డి పై చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు.లేనిపక్షంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన,పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story